![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో చాల ఫన్నీగా ఆది పెళ్లి కాన్సెప్ట్ తో బాగా ఎంటర్టైన్ చేసింది. ఐతే ఈ షోలో పటాస్ ప్రవీణ్ మాత్రం ఈ షోలో జడ్జ్ ఇంద్రజని ఏడిపించేసాడు. ఇంద్రజ కూడా ఎమోషన్ అయ్యింది కానీ బయటకు ఆ ఎమోషన్ ని కనిపించనివ్వకుండా దాచేసుకుంది. ఇంతకు ఎం జరిగింది అంటే ప్రవీణ్ కి ఫైమాకి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందన్న విషయం మనకు ఎప్పటినుంచో తెలుసు కానీ ప్రస్తుతానికి వాళ్ళ మధ్య ఏమీ లేదు అంటూ వాళ్ళ పేరెంట్స్ కూడా తేల్చి చెప్పేసారు.
ఐతే ప్రవీణ్ ఇప్పుడు ఒక అమ్మాయిని శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీదకు తీసుకొచ్చాడు. ఆమె పేరు మమతా అని ఇంట్రడ్యూస్ కూడా చేసాడు. ఓకే ఈవెంట్ కి రాజమండ్రి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది అని చెప్పాడు. ఇక రష్మీ, ఇంద్రజ చాల హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఇంద్రజ కూడా ప్రవీణ్ కి విషెస్ చెప్పారు. కార్ కొన్నది మమతా కోసమేనా అంటూ ఆట పట్టించారు కూడా.. ఐతే ప్రవీణ్ మాత్రం తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ప్రపోజ్ ఎందుకు చేయలేదు అంటూ రష్మీ కూడా ఫైర్ అయ్యింది. ఇంత అందమైన అమ్మాయికి కూడా నువ్వు లవ్ ప్రపోజ్ చేయలేదంటే వేస్ట్ అంటూ కూడా కామెంట్స్ చేసింది. ఐతే ఇంద్రజ మాత్రం ప్రవీణ్ కి ఒక సలహా ఇచ్చారు. పేరెంట్స్ కి చెప్పి వాళ్ళ పర్మిషన్ తో పెళ్లి చేసుకో అంటూ మమతాకి ప్రవీణ్ కి చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత ఇంద్రజ హ్యాపీమూడ్ లో ఉండగా అమ్మా ఇదంతా ప్రాంక్..అసలు ఈ పెళ్లి విషయం చెప్తే మీరు ఎలా ఫీలవుతారో అంటూ సరదాగా ఈ కాన్సెప్ట్ మీద చేసాం అని ప్రవీణ్ ఫైనల్ గా షాకిచ్చేసరికి ఇంద్రజ చాల ఫీలైపోయి తలదించేసుకున్నారు.
![]() |
![]() |